తెలంగాణ

telangana

ETV Bharat / crime

Kukatpally fire accident : కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం.. థియేటర్‌ పూర్తిగా దగ్ధం - తెలంగాణ వార్తలు

Kukatpally fire accident : హైదరాబాద్​ కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కేపీహెచ్​బీలోని శివపార్వతి థియేటర్​లో మంటలు చెలరేగి... సామగ్రి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి... మంటలను ఆర్పివేశారు.

Kukatpally fire accident, theatre fire
థియేటర్​లో అగ్నిప్రమాదం

By

Published : Jan 3, 2022, 6:44 AM IST

Updated : Jan 3, 2022, 7:24 AM IST

Kukatpally fire accident: హైదరాబాద్‌ కేపీహెచ్​బీ కాలనీలోని శివపార్వతి థియేటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగాయి. మంటల ధాటికి థియేటర్‌లో సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. అగ్నికీలల ధాటికి థియేటర్‌ పైకప్పు కుప్పకూలింది. ప్రమాద సమయంలోఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

థియేటర్‌లో మంటలు గమనించిన సెక్యూరిటీ గార్డు... అగ్నిమాపకశాఖకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది... మూడు అగ్నిమాపక యంత్రాలతో 3గంటలపాటు శ్రమించి మంటలార్పారు. షార్ట్ సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.

థియేటర్​లో అగ్నిప్రమాదం

ఇదీ చదవండి:Bandi Sanjay Arrest: బండి సంజయ్‌ జాగరణ దీక్ష భగ్నం.. అరెస్ట్​ చేసిన పోలీసులు

Last Updated : Jan 3, 2022, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details