హైదరాబాద్, లింగంపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి స్థానిక రెహన్ జువెలర్స్ అనే నగల దుకాణంలో చొరబడి.. రూ. 4 లక్షల నగదుతో పాటు, 15 తులాల బంగారు, 15 కేజీల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. షాప్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను సైతం ఎత్తుకెళ్లారు.
అర్ధరాత్రి నగల దుకాణంలో భారీ చోరీ - నగల షాపులో చోరీ
హైదరాబాద్, లింగంపల్లిలోని ఓ బంగారు నగల దుకాణంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు.. వెనక భాగం నుంచి షాపులోకి చొరబడి రూ. 4 లక్షల నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.
నగల దుకాణంలో చోరీ
ఉదయం దుకాణానికి వచ్చిన యాజమాని.. షాపు వెనక భాగం నుంచి చోరీ జరిగినట్లు గుర్తించి చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. క్లూస్ టీమ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:కొడుకును ఆర్టీసీ బస్సులో వదిలేసిన తండ్రి!