కుటుంబ కలహాల కారణంగా పద్మ అనే వివాహిత చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో జరిగింది.
కుటుంబ కలహాలతో వివాహిత బలవన్మరణం - కుటుంబ కలహాలతో కామారెడ్డి జిల్లాలో వివాహిత ఆత్మహత్య
పుట్టింటికి వచ్చిన ఓ వివాహిత చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
జిల్లాలోని మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన నాయికోటి పద్మకు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామానికి చెందిన నరేష్‌తో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లగా.. కూతురు శ్రీనిధి(12)తో ఆమె కలిసి ఉంటోంది. ఈ క్రమంలో పది రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన పద్మ ఊర్లోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.