Woman missing with kids in Nizamabad : నిజామాబాద్లో తల్లితో పాటు ఇద్దరు పిల్లల అదృశ్యం కలకలం రేపుతోంది. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్నగర్కు చెందిన కవిత(32) అనే వివాహిత తన కూతురు అనూష(14), కుమారుడు మహేందర్( 7 )ను తీసుకొని ఈ నెల 7న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. రెండు రోజుల పాటు బంధువుల ఇళ్లతో పాటు తెలిసిన చోట్లన్నీ వెతికినా ఆచూకీ దొరకలేదు.
పిల్లలతో సహా మహిళ అదృశ్యం.. రెండు రోజులైనా..! - Woman missing with kids in Nizamabad
Woman missing with kids in Nizamabad : నిజామాబాద్లో ఓ వివాహిత తన కుమారుడు, కుమార్తెతో సహా అదృశ్యమవటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల నుంచి ఎంత వెతికినా ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన పోలీసులు.. వాళ్లను వెతికే పనిలో పడ్డారు.
పిల్లలతో సహా మహిళ అదృశ్యం.. రెండు రోజులైనా..!
ఇక చేసేదేమీ లేక కవిత భర్త పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకూ.. పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి ఆ మహిళ ఎందుకు వెళ్లిపోయిందన్న కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు.