సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి(West Marredpally )లోని లలితా నగర్ కాలనీలో కొమురయ్య, నిర్మల దంపతులు నివాసముంటున్నారు. ఆరోగ్యరీత్యా స్కానింగ్ సెంటర్కి వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకి చెప్పి బయటకు వెళ్లిన నిర్మల ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు చుట్టుపక్కలా వెతికారు.
Women Missing: స్కానింగ్కి వెళ్తున్నానని చెప్పింది... అదృశ్యమైంది - వివాహిత అదృశ్యం
స్కానింగ్ సెంటర్కు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లిన వివాహిత అదృశ్యమైన ఘటన మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Women Missing: స్కానింగ్కి వెళ్తున్నానని చెప్పింది... అదృశ్యమైంది
ఇరుగు పొరుగు వారిని, బంధువుల ఇళ్లలో ఆరా తీసినా... ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. వెంటనే నిర్మల భర్త కొమురయ్య మారేడ్పల్లి పోలీసులను ఆశ్రయించాడు. (Women Missing)కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:కరోనా రోగుల సేవలో యువతి- అంబులెన్స్ డ్రైవర్గా ఆదర్శం