తెలంగాణ

telangana

ETV Bharat / crime

వివాహిత మృతి.. బంధువుల ఫిర్యాదు - telangana news today

భర్త, అత్తమామలే పథకం ప్రకారం తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. పెళ్లైన రెండేళ్ల నుంచి వారి మధ్య తరచూ గొడవలు జరగుతుండేవని వారు వెల్లడించారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Married women death news, nirmal district crime news
వివాహిత మృతి.. బంధువుల ఫిర్యాదు

By

Published : Apr 3, 2021, 9:22 AM IST

నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని వెంగ్వాపేట్​లో వివాహిత అనుమానాస్పద స్థితిలో శుక్రవారం మృతి చెందింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీకి చెందిన బత్తుల భూమన్న లక్ష్మిల కుమార్తె ఆనంది(26)ని.. నిర్మల్ మండలంలోని వెంగ్వాపేట్​కి చెందిన సుకుమార్​తో 2016లో వివాహం జరిగింది. రెండేళ్ల తర్వాత వారి మధ్య మనస్పర్థలతో తరచుగా గొడవలు జరుగుతుండేవని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

గురువారం ఆదిలాబాద్​లో జరిగిన ఓ ఫంక్షన్​కు హాజరై తిరిగి వచ్చిన ఆనంది.. శుక్రవారం ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి తలకు బలమైన గాయలు ఉండటం వల్ల భర్త, అత్తింటివారే చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి పేర్కొన్నారు. మృతదేహాన్ని నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఆ మృతదేహం మెడపై గాట్లు ఉండటం, కాళ్లు, చేతులు తాళ్లతో కట్టిన గాట్లు ఉండడం వల్ల..అది ఆత్మహత్య కాదు హత్యని పేర్కొంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను అన్యాయంగా చంపిన భర్తతోపాటు అత్తమామలపై కేసు నమోదు చేసి.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు.

ఇదీ చూడండి :ఆర్టీసీ బస్సు ఇంజిన్ నుంచి మంటలు

ABOUT THE AUTHOR

...view details