తెలంగాణ

telangana

ETV Bharat / crime

Women murder: వివాహేతర సంబంధానికి బలైన మహిళ... అసలేం జరిగిందంటే.. - తెలంగాణ క్రైమ్​ న్యూస్

Women murder: క్షణికమైన సుఖం కోసం తప్పటడుగు వేసిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే పథకం ప్రకారం హత్య చేశాడు. ఈ ఘటన పటాన్​చెరు పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

Women murder
Women murder

By

Published : Dec 4, 2021, 4:38 PM IST

Women murder: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే పథకం ప్రకారం హత్య చేశాడు. అమీన్‌పూర్‌ మండలం జానకంపేటకు చెందిన నాగమణిని నరసింహులు అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆ మహిళ క్షణికమైన సుఖం కోసం తప్పటడుగు వేసింది. ఉన్నట్లుండి ఈనెల 2న నాగమణి అదృశ్యం అయ్యింది. దీంతో తన భర్త అమీన్‌పూర్‌ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. జిన్నారం మండలం దువ్వగుంటకు చెందిన జంగయ్య అనే వ్యక్తితో నాగమణికి వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మొదటగా తనకు సంబంధం లేదని చెప్పిన అతను.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నాడు. నాగమణిని తానే చంపినట్లు చెప్పాడు. పటాన్​చెరు మండలం రామేశ్వరం గ్రామ శివారులో హత్య చేసినట్లు తెలిపాడు. అలాగే మృతదేహం ఉన్న ప్రాంతాన్ని చూపించాడు. మృతదేహాన్ని పరిశీలించిన అమీన్‌పూర్‌ పోలీసులు... క్లూస్ బృందాన్ని రప్పించి వివరాలు సేకరించారు. నాగమణి మృతదేహం పెద్దకుంటలో పడి ఉండటాన్ని జిల్లా అదనపు ఎస్పీ నితిక పంతు పరిశీలించారు.

ఇదీ చదవండి:Mother and daughter murder Case : గొంతుకోసి తల్లీకుమార్తె దారుణ హత్య.. అసలేమైంది?!

ABOUT THE AUTHOR

...view details