సికింద్రాబాద్ చిలికలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల కుమారుడితో సహా తల్లి అదృశ్యమైంది. శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన గజ్జల సుధాకర్, కావ్యలు భార్యాభర్తలు చిలకలగూడలో నివాసముంటున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు మహేష్ ఉన్నాడు. సుధాకర్ ట్రాలీ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇన్నాళ్లు సంతోషంగా సాగిన వీరి కాపురంలో కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.
Missing: ఆరేళ్ల కొడుకుతో సహా వివాహిత అదృశ్యం - హైదరాబాద్ తాజా క్రైమ్ వార్తలు
భర్త తరచూ తనతో గొడవపడుతున్నాడని మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆరేళ్ల కొడుకుతో కలిసి ఎక్కడికో వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆరేళ్ల కొడుకుతో సహా వివాహిత అదృశ్యం
శనివారం ఉదయం కూడా గొడవ కావడంతో మనస్తాపానికి గురైన కావ్య కొడుకును తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయింది. ఎంతకీ రాకపోవడంతో బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి కనుక్కున్నాడు. అందరూ రాలేదని చెప్పగా.. ఎం చేయాలో పాలుపోని సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కావ్య, మహేష్‌ను వెతికే పనిలో పడ్డారు.
ఇదీ చదవండి :Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి