తెలంగాణ

telangana

ETV Bharat / crime

'భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు' - వివాహేతర సంబంధం

మెదక్ జిల్లా రాచపల్లిలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనే కారణంతో.. ఓ వ్యక్తి, తన భార్యను హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు.. మహిళది హత్యా.. ? లేక ప్రమాదమోనని తేల్చే పనిలో పడ్డారు.

Married woman suspicious death in medak
'భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు'

By

Published : Mar 12, 2021, 6:34 PM IST

విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా ఫరీద్ పూర్​లో జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో.. భర్తే హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరిస్తున్నట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మెదక్ మండలం రాచపల్లి గ్రామానికి చెందిన మరియమ్మకు, ఘనపూర్ మండలం ఫరీద్ పూర్ గ్రామానికి చెందిన యేసోబుకు 2002వ సంవత్సరంలో వివాహమైంది. యేసోబుకు అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ భార్య.. భర్తతో తరచూ గొడవ పడేది. ఇదే విషయాన్ని.. పలుమార్లు పెద్దల సమక్షంలోనూ తెలిపి.. వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని యేసోబుకు చెప్పించినట్లు స్థానికులు తెలిపారు.

రాత్రి సమయంలో పొలానికి వెళ్లిన మరియమ్మను.. భర్తే పథకం ప్రకారం హత్య చేసి, ప్రమాదవశాత్తు మరణించినట్లు చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:పెళ్లైన రెండునెలలకే చంపేశాడు.. ఆపై...

ABOUT THE AUTHOR

...view details