కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట పోలీస్ స్టేషన్ ఎదుట చిట్యాల సంధ్య అనే వివాహిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన పోలీసులు వివాహితను చికిత్స నిమిత్తం జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం - Married woman suicide attempt news
భార్య భర్తలు మధ్య గొడవతో... వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఇల్లందుకుంట మండలం శ్రీరాములపల్లికి చెందిన సంధ్య, కేశవపట్నం మండలం ఇప్పలపల్లికి చెందిన సంతోశ్లు ప్రేమించుకున్నారు. గత సంవత్సరం ఇల్లందుకుంటలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కాపురం కొంతకాలం సజావుగానే సాగింది. సంతోష్ బంధువులు వీరి సంసార జీవితంలో ఆగాదాలు సృష్టించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వేరే కులం అంటూ గొడవలు సృష్టించారని పేర్కొంది. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
సోమవారం కౌన్సిలింగ్కు రావాలని పోలీసులు సూచించారు. భర్త తరఫు వాళ్లు వాయిదాల పేరుతో సమయానికి రాకుండా ఉన్నారని బాధితురాలు వెల్లడించింది. ఈసారి కూడా రాకుండా ఉంటారని.. ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పింది. సంధ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.