తెలంగాణ

telangana

ETV Bharat / crime

Suicide: వివాహిత ఆత్మహత్య... కారణం అదేనా? - hyderabad district latest news

మానసిక ఒత్తిడితో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్​కు ఉరి వేసుకుని మరణించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Married lady suicide with mental stress
Married lady suicide with mental stress

By

Published : Jun 11, 2021, 9:45 AM IST

Updated : Jun 11, 2021, 2:53 PM IST

మానసిక ఒత్తిడితో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్‌అల్వాల్​లో చోటు చేసుకుంది. బృందావన్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న రాధిక గత రెండు నెలలుగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయమై పలుమార్లు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొన్నారు.

ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Suicide: కుటుంబ కలహాలతో వృద్ధురాలు ఆత్మహత్య

Last Updated : Jun 11, 2021, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details