తెలంగాణ

telangana

ETV Bharat / crime

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతదేహం లభ్యం - హైదరాబాద్‌ నేర వార్తలు

ఏడాదిన్నర క్రితమే వివాహమైన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. భర్త, అతని కుటుంబ సభ్యులే తమ కుమార్తెను హతమార్చారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.

Married body found in suspicious condition in kalupur police station
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతదేహం లభ్యం

By

Published : Mar 3, 2021, 2:09 PM IST

హైదరాబాద్‌లోని కల్సుంపురా పోలీస్ ‌స్టేషన్‌ పరిధిలో అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతదేహం లభ్యమైంది. భర్త, అతని కుటుంబ సభ్యులే తమ కుమార్తెను చంపి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

బాధితురాలు మేరాజ్ బేగంకు ఇమ్రాన్‌ అనే వ్యక్తితో 14 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన నెల రోజుల నుంచే భర్త అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభించాడని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు.

ఈ విషయమై పలు మార్లు ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయని అన్నారు. ఈ క్రమంలోనే వారు తమ కుమార్తెను హతమార్చి ఉంటారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:వివాహిత ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

ABOUT THE AUTHOR

...view details