తెలంగాణ

telangana

ETV Bharat / crime

పెళ్లి చేసుకుంటానని నమ్మించి... పదిన్నర లక్షలు దోచేశాడు - పదిన్నర లక్షలు

మ్యాట్రిమోనీలో అమ్మాయి ప్రొఫైల్​ చూశాడు. తానూ ఓ ప్రొఫైల్​ క్రియేట్​చేసి వలేశాడు. అమెరికాలో ఉద్యోగమని... తాను తెగ నచ్చేశావని నమ్మబలికాడు. వీసా పంపుతానని, ఇంటికి మరమ్మతుల పేరుతో పదిన్నర లక్షలు లాగి... ముఖం చాటేశాడు.

marriage cheating case filed in begumpet
marriage cheating case filed in begumpet

By

Published : May 3, 2021, 4:39 PM IST

పెళ్లి పేరుతో పదిన్నల లక్షలు దండుకొని ముఖం చాటేశాడు ఓ సైబర్​ నేరగాడు. హైదరాబాద్ బేగంపేటకు చెందిన ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగిని తెలుగు మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ పెట్టింది. యువతి ప్రొఫైల్​ చూసిన దుండగుడు... మునగర్స్ మేహుల్ కుమార్​గా పరిచయం చేసుకున్నాడు. అమెరికాలో పని చేస్తున్నానని యువతికి మాయమాటలు చెప్పాడు. తన ప్రొఫైల్ నచ్చిందని... తనను వివాహం చేసుకోవడానికి అంగీకారమే అని చెప్పి యువతితో పరిచయం పెంచుకున్నాడు.

ఒక దశలో వీసా పంపిస్తానని దీనికి రూ. 50 వేల ఖర్చు అవుతాయని నమ్మబలికాడు. అకౌంట్లో రూ. 50 వేలను యువతి డిపాజిట్ చేసింది. ఇంకోసారి గుజరాత్​లో ఇల్లు కొన్నానని... దానికి మరమ్మతు చేసేందుకు డబ్బులు కావాలని తెలిపాడు. ఈ సాకుతో తన అకౌంట్​లో రూ. 10 లక్షలు జమ చేయించుకున్నాడు. పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో... మాట దాటేయటం వల్ల యువతికి అనుమానం వచ్చింది. విచారణ చేయగా తాను మోసపోయినట్టు తెలుసుకుంది. హైదరాబాద్ సైబర్​క్రైమ్ పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి:దుండగుల దాడి... కోలుకోలేక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

ABOUT THE AUTHOR

...view details