మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్లో మహిళా ట్రైనీ ఎస్సైపై లైంగిక వేధింపుల ఆరోపణల మీద ఎస్సై శ్రీనివాస రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. అతనిపై ఫిర్యాదు మేరకు అతనిపై ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. పై అధికారులకు నివేదిక పంపించామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా విజిలెన్స్ కమిటీ వేస్తామని చెప్పారు. తద్వారా పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.
మంగళవారం.. ఎస్సై శ్రీనివాస రెడ్డి తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటూ.. మహిళా శిక్షణ ఎస్సై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సైని సస్పెండ్ చేస్తూ నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నిన్న ఉదయం అక్రమంగా రవాణా చేస్తున్న నల్లబెల్లాన్ని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన శ్రీనివాస్ రెడ్డి.. ఉన్నతాధికారుల నుంచి రివార్డులు, సత్కారం పొందారు. అలా జరిగిన కొద్దిగంటల్లోనే అతనిపై లైంగిక వేధింపుల ఫిర్యాదుతో అరెస్టై సస్పెండ్ అయ్యారు.
ఇవీ చదవండి:Maripeda SI: ట్రైనీ మహిళా ఎస్సైపై సబ్ ఇన్స్పెక్టర్ అత్యాచారయత్నం.. అసలేం జరిగిందంటే?
Revanth reddy: 'ఆదివాసీలకు మద్దతుగా..సెప్టెంబరులో తెలంగాణకు రాహుల్'