Ganja Found in Accident car: ఆదివారం తెల్లారుజామున భద్రాచలం వైపు నుంచి సారపాక వైపునకు వెళ్తున్న కారు.. ఓవర్ స్పీడ్‌గా వెళ్తూ ప్రధాన రహదారిపై బోల్తా కొట్టింది. ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకోగా కారులో నిషేధిత గంజాయి బయటపడింది. కారుతో పాటు గంజాయిని బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కారు డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న నిందితులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు, వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అయితే గంజాయి భద్రాచలం వైపు నుంచి సారపాక వెళ్లినట్లు తెలుస్తోంది. భద్రాచలం వద్ద చెక్‌పోస్ట్ ఫారెస్ట్ పోలీస్ అధికారులు ఉన్నప్పటికీ కారులో గంజాయి చెక్‌పోస్ట్ దాటి ఎలా వెళ్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.