తెలంగాణ

telangana

ETV Bharat / crime

Maoists: మావోయిస్టుల దుశ్చర్య.. ప్రయాణికుల బస్సుకు నిప్పు - అల్లూరు సీతరామరాజు జిల్లాలో బస్సుకు నిప్పుపెట్టిన మావోయిస్టులు

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. బస్సులోని ప్రయాణికులను దింపి.. వాహనానికి నిప్పు పెట్టారు. దాంతో బస్సులోని ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు.

మావోయిస్టుల దుశ్చర్య.. ప్రయాణికుల బస్సుకు నిప్పు
మావోయిస్టుల దుశ్చర్య.. ప్రయాణికుల బస్సుకు నిప్పు

By

Published : Apr 25, 2022, 1:07 PM IST

మావోయిస్టుల దుశ్చర్య.. ప్రయాణికుల బస్సుకు నిప్పు

ఆంధ్రప్రదేశ్​లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సును అడ్డగించి.. ప్రయాణికులను కిందకు దింపారు. అనంతరం ఆ బస్సుకు నిప్పుపెట్టారు. చింతూరు మండలం కొత్తూరు వద్ద ఈ ఘటన జరిగింది. దాంతో రహదారిపై అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మావోసుస్టుల దుశ్చర్యతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దండకారణ్యం బంద్‌ పిలుపు దృష్ట్యా.. బస్సుకు నిప్పుపెట్టినట్లు సమాచారం.

మావోయిస్టు నాయకురాలు నర్మద మృతికి సంతాపంగా ఈరోజు మావోయిస్టులు దండకారణ్య బంద్​కు పిలుపునిచ్చారు. నర్మద స్వస్థలం కృష్ణాజిల్లా. నర్మద అలియాస్​ అల్లూరి ఉషారాణి 1980లో మద్రాసు యూనివర్సిటీ నుంచి ఎంఏ చేసిన తర్వాత.. ఉద్యమంలోకి వెళ్లారు. 42 ఏళ్లు ఆమె ఉద్యమంలో పని చేశారు. పీడబ్ల్యూజీ, గడ్చిరోలి జిల్లా సీజీ బోర్డర్​ ఏరియాలో పని చేశారు. ఆమెపై 150 కేసులు ఉన్నాయి. ఆమె 2019లో కేన్సర్​ చికిత్స నిమిత్తం హైదరాబాద్​కు రాగా.. పోలీసులు అరెస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details