ఆంధ్రప్రదేశ్ విశాఖ మన్యంలో మావోయిస్టులు మరోసారి అలజడి సృష్టించారు. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోని కారణంగా..ముంచింగ్‌పుట్ మండలం బూసిపుట్టు పంచాయతీకి నామినేషన్ దాఖలు చేసిన సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేశారు.
మావోల దుశ్చర్య.. సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్
ఏపీ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోని కారణంగా విశాఖ మన్యంలో సర్పంచ్ అభ్యర్థి భర్తను మావోయిస్టులు ఆదివారం కిడ్నాప్ చేశారు. ముంచింగ్‌పుట్ మండలం బూసిపుట్టు పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోగా..బాధితుడిని ఇవాళ విడిచిపెట్టారు.
సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
వై.కంఠారం గ్రామానికి చెందిన రాజమ్మ వైకాపా బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆదివారం రాత్రి వై.కంఠారం గ్రామానికి వచ్చిన మావోయిస్టులు.. ఆమె భర్త నాగేశ్వరరావును అపహరించికెళ్లారు. దీంతో ఏజెన్సీలో ఒక్కసారిగా అలజడి రేగింది. సోమవారం మధ్యాహ్నం సమయంలో మావోయిస్టులు బాధితుడిని విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
- ఇదీ చదవండి :తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయాలు