తెలంగాణ

telangana

ETV Bharat / crime

Maoist Dead : భద్రాద్రి పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి - maoist died in police attack in bhadradri

భద్రాద్రిలో పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి
భద్రాద్రిలో పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి

By

Published : Aug 1, 2021, 9:51 AM IST

Updated : Aug 1, 2021, 11:48 AM IST

09:48 August 01

Maoist Dead : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు

మావోయిస్టు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చర్ల అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో పోలీసుల చేతిలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. 

చర్ల మండలంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో ఇవాళ ఉదయం పోలీసులు కుర్నాపల్లి బోధన్​పల్లి గ్రామ సమీపంలో కూంబింగ్​కు వెళ్లారు. ఈ క్రమంలో వారికి 10 మంది మావోయిస్టులు తారసపడినట్లు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు.. మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు మృతదేహంతో పాటు 303 వెపన్, రెండు కిట్టు బ్యాగులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఘటనలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఘటనాస్థలికి పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలను తరలించారు. మృతి చెందిన మావోయిస్టును ఇంకా గుర్తించాల్సి ఉంది. ఈ కాల్పులతో భద్రాద్రి ఏజెన్సీలో ఉద్రిక్తత నెలకొంది. 

Last Updated : Aug 1, 2021, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details