భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు గురువారం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో రాళ్లపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టు మిలీషియా సభ్యులు అనుమానాస్పదంగా సంచరిస్తూ కంటపడ్డారు. పోలీసులను చూసి వారు పారిపోతుండగా వెంబడించి వారిలో ఒకరిని పట్టుకున్నారు. అతన్ని విచారించగా.. రాళ్లపురానికి చెందిన మావోయిస్టు మిలీషియా సభ్యుడు ముసికి రాజన్న అలియాస్ రాజయ్యగా తేలింది.
మావోయిస్టు మిలీషియా సభ్యుడి అరెస్ట్ - bhadradri kothagudem news
మావోయిస్టు అమర్చిన ప్రెషర్ బాంబులు వెలికితీసి... ఒక మావోయిస్టు మిలీషియా సభ్యున్ని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ప్రెషర్ కుక్కర్‌తో పాటు 200 మీటర్ల కార్డెక్స్ వైరు, ఒక డిటోనేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టు మిలీషియా సభ్యుడి అరెస్ట్
ఇతని నుంచి ప్రెషర్ కుక్కర్‌తోపాటు 200 మీటర్ల కార్డెక్స్ వైరు, ఒక డిటోనేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 20 మంది మిలీషియా సభ్యులతో కలిసి చర్ల ఏరియాలో బాంబులను అమర్చేందుకు వచ్చినట్లు విచారణలో రాజన్న వెల్లడించారు. రాళ్లాపురం-భట్టిగూడెం గ్రామాల మధ్య వాగు వద్ద ఒక ప్రెషర్ బాంబును అమర్చినట్లు వెల్లడించడంతో దాన్ని బాంబు స్క్వాడ్ బృందం గుర్తించి పేల్చివేసింది.