తెలంగాణ

telangana

ETV Bharat / crime

Maoist Couriers Arrest: ముగ్గురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్ - ap news

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం గొరెలగూడెం వద్ద ముగ్గురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి మావోయిస్టులకు చేరవేసేందుకు సిద్ధంగా ఉన్న 9 లక్షలకు పైగా డబ్బు దొరికింది. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Maoist
మావోయిస్టు కొరియర్లు అరెస్ట్

By

Published : Jun 15, 2021, 9:27 PM IST

మావోయిస్టుల(Maoists)కు డబ్బులు చేరవేస్తున్న ముగ్గురు కొరియర్లను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా (east godavari district) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారం మేరకు.. చింతూరు మండలం గొరెలగూడెం వద్ద స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు ద్విచక్రవాహనాలపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించటంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు చింతూరు డీఎస్పీ ఖాదర్ బాషా వెల్లడించారు.

'మావోయిస్టులకు డబ్బులు తరలిస్తున్నారని ఎస్పీ కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఈ మేరకుగొరెలగూడెం వద్ద తనిఖీలు చేపట్టాం. అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాం. వారి వద్ద నుంచి రూ. 9.73 లక్షలు పట్టుబడ్డాయి. వీటిపై ఆరా తీయగా.. స్థానికంగా ఉన్న పలువురు గుత్తేదారుల నుంచి వసూళ్లు చేసినట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీ ఆదేశాల మేరకు.. కొరియర్లు ఆ డబ్బులను వారికి చేరవేసేందుకు బయల్దేరారు. మందుగుండు సామగ్రి కొనుగోళ్ల కోసం ఈ డబ్బులను తీసుకెళ్తున్నట్లు నిందితులు తెలిపారు. కేసు నమోదు చేసి కొరియర్లను అరెస్ట్ చేశామని'ఆయన వివరించారు.

ఇదీ చదవండి:holidays for schools: పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details