Man Kissed a Snake in Medchal: మేడ్చల్ జిల్లా గాజూలరామారం పరిధిలోని కట్టమైసమ్మ బస్తీలో నివాసముంటున్న ఆకాశ్(30) మహారాష్ట్ర నుంచి వలసవచ్చాడు. బస్తీలో కుటుంబంతో సహా నివాసముంటున్న ఆకాశ్ స్థానికంగా రాళ్లు కొడుతూ బతుకు బండిని లాగుతున్నాడు. అతను పాములు పట్టడంలో దిట్ట. ఆదివారం రోజు రాత్రి జనావాసాల్లోకి వచ్చిన విషసర్పాన్ని పట్టుకున్న ఆకాశ్.. మెడలో వేసుకుని ఆ పామును ముద్దాడుతూ ఫొటోలకు పోజిచ్చాడు. అనంతరం ఆ సర్పాన్ని చెట్లపొదల్లో వదిలేశాడు.
Man Kissed a Snake in Medchal : పామును ముద్దాడుతూ ఫొటోకు పోజ్.. అస్వస్థతకు గురై ప్రాణాలతో ఫైట్ - మేడ్చల్లో పాముని ముద్దాడిన వ్యక్తి
Man Kissed a Snake in Medchal : పాములు పట్టుకోవడంలో దిట్ట అయిన ఓ వ్యక్తి ఆదివారం రాత్రి ఓ విషసర్పాన్ని పట్టుకున్నాడు. ఆ పామును మెడలో వేసుకుని ముద్దాడుతూ ఫొటోలకు పోజులిచ్చాడు. అనంతరం ఆ సర్పాన్ని వదిలిపెట్టాడు. అదేరాత్రి అతను అస్వస్థతకు గురై.. ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నాడు.
Man Kissed a Snake in Medchal
Snake Kisses a Man in Gajularamaram : అదేరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆకాశ్ అస్వస్థతకు గురయ్యాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతణ్ని సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. పాము కాటు వేయడం వల్లే ఆకాశ్ అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు.