పుట్టింటికి వెళ్లిన భార్య.. కాపురానికి రానంటోందని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో గురువారం రాత్రి చోటుచేసుకొంది.
ఆదిలాబాద్ జిల్లా పాత ఉట్నూర్లో నివాసముంటున్న గోపాల్.. కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మద్యానికి బానిసై.. రోజూ భార్యతో గొడవ పడేవారు. విసిగిపోయిన భార్య కమల.. పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి.. పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్య తనతో కాపురం చేసేలా చూడాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. కౌన్సిలింగ్ ఇచ్చేందుకు గోపాల్, కమలను.. సీఐ, ఎస్సై.. స్టేషన్కు పిలిపించారు. తన భర్తతో ఇక కలిసి ఉండలేనని కమల పోలీసులకు చెప్పి బయటకు వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న గోపాల్ మనస్తాపానికి గురై.. ఠాణా సమీపంలోని టవర్ ఎక్కాడు. గమనించిన పోలీసులు అతనికి నచ్చచెప్పి.. కిందకు రప్పించారు.
ఇవీచూడండి:ఆటోను తప్పించబోయి బస్సు కిందపడి వ్యక్తి మృతి