సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని కొవిడ్ కేంద్రం నుంచి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. మెదక్ జిల్లా మల్కాపురం గ్రామానికి చెందిన సిద్దిరాములు.. కొవిడ్ సోకిన అతని భార్య చికిత్స కోసం గాంధీలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 5న బాధితురాలు ప్రాణాలు విడిచింది.
కొవిడ్‌తో భార్య మృతి.. భర్త అదృశ్యం - gandhi covid center
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారభించారు.
man went missing
సమాచారం అందుకున్న బంధువులు ఆస్ప త్రికి చేరుకున్నారు. మృతురాలి భర్త ఆచూకీ లభించకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:Woman suicide: బావిలో దూకి మహిళ ఆత్మహత్య.. అనాథలైన పిల్లలు