భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన కోదండం... చేపలు పట్టి జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు గోదావరిలో దిగిన కోదండం గల్లంతయ్యాడు.
గోదావరిలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి - వ్యక్తి మృతి
చేపలు పట్టేందుకు గోదావరికి వెళ్లిన ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గోదావరిలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
గమనించిన స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కోదండం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.