Train Hits a Man Adilabad : వాహనాలు నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు. ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వినకూడదని తరచూ ట్రాఫిక్ అధికారులు చెబుతుంటారు. ఎవరైనా అలా కనిపిస్తే వారిని పక్కకు ఆపి.. హెచ్చరిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు ఈ నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంది. కానీ రోడ్డుపై నడుస్తున్నప్పుడు కూడా ఈ నిబంధనలు పాటించాల్సిందే. మీరు చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకని పాటలు వింటూ వెళ్తుంటే.. వెనక నుంచి వాహనాలు హారన్ కొట్టినా వినపడక ప్రమాదం జరిగే ఆస్కారముంది. ఫోన్ మాట్లాడుతూ దృష్టి రోడ్డుపై ఉంచకపోతే యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంది. అందుకే రోడ్డుపై నడుస్తున్నప్పుడైనా.. వాహనం నడుపుతున్నప్పుడై దృష్టంతా అక్కడే ఉండాలి. నిబంధనలు తప్పక పాటించాలి.
Train Hits a Man Adilabad : ఫోన్ మాట్లాడుతూ పట్టాలపై నడక.. రైలు ఢీకొని యువకుడు మృతి - adilabad train accident today
Train Hits a Man Adilabad : ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతుండగా.. ఓ యువకుడిని రైలు ఢీకొట్టిన ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.
![Train Hits a Man Adilabad : ఫోన్ మాట్లాడుతూ పట్టాలపై నడక.. రైలు ఢీకొని యువకుడు మృతి Train Hits a Man Adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13994629-thumbnail-3x2-a.jpg)
Man Hit by Train Adilabad : తాజాగా ఇలా చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ ఓ యువకుడు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటన ఆదిలాబాద్‌లో జరిగింది. ఆదిలాబాద్ పట్టణం డాల్డా కంపెనీ కాలనీవాసి కావడే ఆకాశ్(21) ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతున్నాడు. రైలు కూత వినిపించకపోవడం.. అతను చుట్టుపక్కల గమనించకపోవడం వల్ల అటుగా వస్తున్న పర్లి ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆకాశ్‌ను రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూనే అతడు మృతి చెందాడు. రోజు తమ మధ్య ఎంతో సరదాగా తిరిగే ఆ కుర్రాడు ఇవాళ నిర్జీవంగా పడి ఉండటం చూసి స్థానికులు విషాదంలో మునిగారు.