హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు. వ్యాపారంలో స్నేహితులు మోసం చేశారని మనస్తాపంతో సురేశ్ అనే వ్యక్తి అంబేడ్కర్ విగ్రహం పైకి ఎక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గమనించి అతడిని అడ్డుకుని.. అదుపులోకి తీసుకుని సైఫాబాద్ ఠాణాకు తీసుకెళ్లాడు.
ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం - హైదరాబాద్ నేర వార్తలు
వ్యాపారంలో స్నేహితులు మోసం చేశారని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగింది.
![ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం ట్యాంక్ బండ్ వద్ద ఆత్మహత్యాయత్నం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:54:26:1620984266-11756253-man.jpg)
ట్యాంక్ బండ్ వద్ద ఆత్మహత్యాయత్నం
రియల్ఎస్టేట్ వ్యాపారంలో తనను స్నేహితులు మోసం చేశారని... ఇదే విషయంపై వారితో గొడవ జరిగిందని.. తెలిపాడు. ఇటీవల జైలుకు వెళ్లొచ్చిన సురేశ్... మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:బెడ్లు రిజర్వు చేసుకున్న వారికే రాష్ట్రంలోకి అనుమతి: డీహెచ్