తెలంగాణ

telangana

ETV Bharat / crime

వైద్యుడినంటూ వల.. పెళ్లిచేసుకుంటానని నగదు మాయం - cyber crimes in Hyderabad

సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా అమాయకులు ఆ కేటుగాళ్ల బారిన పడి మోసపోతూనే ఉన్నారు. స్కాట్​లాండ్​లో వైద్యుడిగా పనిచేస్తున్నానని చెప్పి ఓ మహిళ వద్ద నుంచి రూ.9 లక్షలు కాజేసిన సంఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

cyber crime, cyber crime in Hyderabad
సైబర్ నేరాలు, హైదరాబాద్​లో సైబర్ క్రైమ్

By

Published : May 16, 2021, 10:28 AM IST

స్కాట్‌లాండ్‌లో కంటి వైద్యుడిగా పనిచేస్తున్నా.. పెళ్లి చేసుకుందాం, బహుమతి పంపుతున్నానంటూ సికింద్రాబాద్‌లో ఉంటున్న ఓ మహిళను మోసగించి రూ.9 లక్షలు బదిలీ చేయించుకున్నాడో సైబర్‌ నిందితుడు.

బాధితురాలు ఓ ప్రైవేటు ఉద్యోగి. భర్త మృతి చెందగా.. మళ్లీ పెళ్లిచేసుకోవాలంటూ తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో, ఓ మ్యాట్రిమోనీలో వివరాలు ఉంచారు. ఓ వ్యక్తి.. క్లిఫర్డ్‌గా పరిచయం చేసుకుని, పంజాబ్‌లో తన మూలాలున్నాయని, ఐరోపాలో స్థిరపడ్డామని చెప్పాడు. తల్లి కోరిక మేరకు దక్షిణాదివారిని పెళ్లి చేసుకుంటానన్నాడు. వారం క్రితం ఫోన్‌ చేసి, పెళ్లికి ముందు బంగారు, వజ్రాలహారం కానుకగా పంపుతున్నానని నమ్మించాడు. శంషాబాద్‌ విమానాశ్రయానికి పార్సిల్‌ పంపానన్నాడు. దాన్ని విడిపించుకునేందుకు ఆమె దశలవారీగా రూ.9 లక్షలు చెల్లించారు. తీరా పార్సిల్‌ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి తమకు ఫిర్యాదు చేశారని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details