తెలంగాణ

telangana

ETV Bharat / crime

మద్యం మానేయమన్నందుకు గొడవ.. మనస్తాపంతో ఆత్మహత్య - man suicide by arguing stop drinking

మద్యం మానేయమని అడిగినందుకు మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్​ మహంకాళి పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

man suicide by arguing stop drinking
మద్యం మానేయమన్నందుకు ఆత్మహత్య

By

Published : May 7, 2021, 8:51 AM IST

మద్యం విషయంలో భార్యతో గొడవ పడి.. మనస్తాపంతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. సికింద్రాబాద్​ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ జనతా బస్తీకి చెందిన శ్రీనివాస్(42).. దోబీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మి, కుమారుడు ప్రతాప్, కుమార్తె వసంత ఉన్నారు. ఇటీవల శ్రీనివాస్​ మద్యానికి బానిసయ్యాడు. రెండు రోజుల క్రితం ఈ విషయంలో ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది.

దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్​ భార్యాపిల్లలతో మాట్లాడటం మానేశాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:మోతె శివారులో యువకుడి హత్య

ABOUT THE AUTHOR

...view details