ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో ఓ వ్యక్తి కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అప్పు ఇచ్చిన యజమాని నెమలికంటి దీక్షమూర్తి ఇంటి ముందే గోపికృష్ణ ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రంగా గాయపడిన గోపికృష్ణను చికిత్స నిమిత్తం.. స్థానికులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తీసుకున్న రుణాన్ని ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి
రెండేళ్ల క్రితం దీక్షమూర్తి దగ్గర.. గోపికృష్ణ రూ.1 లక్ష 50వేల నగదును రెండు రూపాయల వడ్డీకి తీసుకున్నాడు. రెండు నెలలు వడ్డీ కట్టిన తరువాత లాక్డౌన్ సమయంలో.. పది రూపాయల వడ్డీ చెల్లించాలని వేధించాడు.రూ.10 వడ్డీ చెల్లించలేకపోతే తీసుకున్న మొత్తం ఒకేసారి ఇవ్వాలని దీక్షమూర్తి డిమాండ్ చేశాడు. నెలల వారీగా రుణాన్ని చెల్లిస్తానన్న ఒప్పుకోలేదని బాధితుడు వాపోయాడు.