Suicide Attempt: తెలంగాణ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కింద ఇళ్ల కోసం అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. కొందరు డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా తనకు రెండు పడక గదుల ఇల్లు ఇవ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
డబుల్ బెడ్రూం ఇల్లు దక్కలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం - double bed room house
Suicide Attempt: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇవ్వాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రవీణ్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు గ్రామసభలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ ఎంపిక లిస్టులో ఆయన పేరును ప్రస్తావించలేదు. దీంతో మనస్తాపం చెంది ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

డబుల్ బెడ్రూం ఇల్లు దక్కలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సిరిసిల్లలో రెండు పడక గదుల లబ్ధిదారుల ఎంపిక చేసేందుకు అధికారులు వార్డుల వారిగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు. శివనగర్‌లో ప్రవీణ్ అనే వ్యక్తి తనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనస్తాపంతో ఒంటిపై పెట్రోలు పోసుకుని బలవన్మరణానికి యత్నించారు. వెంటనే గమనించిన పోలీసులు ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. అభ్యర్థనను పరిశీలిస్తామని హమీ ఇచ్చిన అధికారులు బాధితుడిని శాంతింపజేశారు.
డబుల్ బెడ్రూం ఇల్లు దక్కలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఇదీ చదవండి: