మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో నరేశ్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసముంటున్నాడు. గురువారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఉన్న నరేశ్.. తన భార్యతో గొడవపడ్డారు.
మద్యం మత్తులో గొంతు కోసుకున్నాడు.. - medchal district crime news
మద్యం మత్తులో భార్యతో గొడవ పడి, మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి తన గొంతును తానే కత్తితో కోసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుణ్ని ఆస్పత్రికి తరలించారు.
మద్యం మత్తులో తన గొంతు తానే కోసుకున్న వ్యక్తి
అనంతరం మనస్తాపానికి గురై తన గొంతును తానే కత్తితో కోసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నరేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
- ఇదీ చూడండి :చెరువులో దూకి ప్రేమజంట ఆత్మహత్య