తెలంగాణ

telangana

ETV Bharat / crime

మెడికల్ డివైస్ పార్క్ సమీపంలో దారుణ హత్య! - సంగారెడ్డి జిల్లా సుల్తాన్​పూర్ వార్తలు

సంగారెడ్డి జిల్లా సుల్తాన్​పూర్ మెడికల్ డివైస్ పార్క్ గుట్టల్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుని సోదరుడే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Man murdered near Sultanpur Medical Device Park in sangareddy
మెడికల్ డివైస్ పార్క్ సమీపంలో దారుణ హత్య!

By

Published : Mar 2, 2021, 1:31 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండలంలోని సుల్తాన్​పూర్ మెడికల్ డివైస్ పార్క్​ సమీపంలో ఉన్న గుట్టల్లో దారుణ హత్య జరిగింది. మృతుడు ఛత్తీస్​గఢ్ రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్​గా పోలీసులు గుర్తించారు.

పటాన్​చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో అమీన్​పూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మెడికల్ డివైస్ పార్క్​లోనే అనిల్ కుమార్ కొంత కాలంగా పని చేస్తున్నాడని చెప్పారు. హత్యకు పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. మృతుని సోదరుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి: బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య.. వేధింపులే కారణమా!

ABOUT THE AUTHOR

...view details