నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని హత్య జరిగింది. ముళ్లపొదల్లో ఘనపూర్ గ్రామానికి చెందిన షేక్ మోసిన్ (32) అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ముళ్ల పొదల్లో పేకాట ఆడుతుండగా మోసిన్కు మరి కొందరితో గొడవ జరిగిందని.. ఈ వివాదమే హత్యకు దారి తీసిందని వివరించారు.
పేకాట ఆడుతుండగా గొడవ.. రాయితో కొట్టి హత్య
నిజామాబాద్ డిచ్పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో షేక్ మోసిన్ (32) అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పేకాట ఆడుతుండగా జరిగిన గొడవే హత్యకు దారి తీసిందని పోలీసుల వెల్లడించారు.
పేకాట ఆడుతుండగా గొడవ.. రాయితో కొట్టి హత్య
ఘటనా స్థలంలో పేకలు ఉన్నందుక పేకాట ఆడుతున్న సమయంలో గొడవ జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు తెలిపారు.. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్, డిచ్పల్లి ఎస్ఐ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:పెళ్లైన రెండునెలలకే చంపేశాడు.. ఆపై...