తెలంగాణ

telangana

డాలర్ల పేరిట వలేసి.. రూ.13 లక్షలు కాజేసి

By

Published : Mar 28, 2021, 11:14 AM IST

ఎస్​టీడీ క్రిస్ట్ కరెన్సీ యాప్​లో వెయ్యి డాలర్లు డిపాజిట్ చేస్తే.. జీవితాంతం ప్రతిరోజు కనీసం 26 డాలర్లు పొందవచ్చని నమ్మబలికి ఓ అమాయకునికి వల విసిరాడు. అది నిజమని నమ్మి సుమారు రూ.13 లక్షల పోగొట్టుకున్న ఆ వ్యక్తి మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

cheating, dollar, cyber crime
సైబర్ క్రైమ్, డాలర్ చీటింగ్

‘‘వెయ్యి డాలర్లు డిపాజిట్‌ చేస్తే.. జీవితాంతం ప్రతి రోజు 26 డాలర్లు పొందవచ్చునంటూ సుమారు రూ.15 వేల డాలర్లు (సుమారు రూ.13 లక్షలు) దోచేశారంటూ'' ఓ బాధితుడు శనివారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. 'నగరానికి చెందిన సయ్యద్‌ ముజాహిద్‌ ఉద్యోగం కోసం ఇటీవల ‘లింక్‌డెన్‌’లో అన్వేషిస్తున్నారు. అదే వేదికగా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ‘‘ఉద్యోగంలో పెద్దగా సంపాదనేమీ ఉండదు. అదే ‘ఎస్‌టీడీ క్రిప్ట్‌ కరెన్సీ’ యాప్‌లో వెయ్యి డాలర్లు డిపాజిట్‌ చేస్తే రోజుకు కనీసం 2.6 శాతం అంటే సుమారు 26 డాలర్లు.. రెండు వేల డాలర్లు పెడితే 52 డాలర్లు పొందవచ్చు’’నని చెప్పాడు. జీవితాంతం కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చని నమ్మించాడని ఎస్సై వినయ్‌కుమార్‌ తెలిపారు.

అవతలి వ్యక్తి తీయని మాటలకు లొంగిపోయిన ముజాహిద్‌ అతను చెప్పినట్లు ఎస్‌టీడీ క్రిప్ట్‌ కరెన్సీ యాప్‌లో నగదు డిపాజిట్‌ చేశారు. ఆ తర్వాత కొంత డబ్బు అతడి ఖాతాలో జమైంది. ముజాహిద్‌కు నమ్మకం కుదరడంతో అతడి భార్య పేరిట కూడా సదరు యాప్‌లో ఖాతా తెరిచాడు. మరో 20 మందిని సభ్యులుగా కూడా చేర్పించాడు. వాళ్లంతా సుమారు రూ.13 లక్షల వరకు డిపాజిట్‌ చేశారు. కానీ ఎవరికీ నయా పైసా రాలేదు. మోసపోయినట్లు గ్రహించి బాధితులందరితో కలిసి ముజాహిద్‌ హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details