Cyber Crime in Hyderabad : ఐదు వందల రూపాయలతో ఆర్డర్ చేసిన బిర్యానీ రాలేదని.. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే 50 వేల కాజేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ ఖైరతాబాద్‌కు చెందిన భాస్కర్... జొమాటో యాప్‌లో బిర్యానీ ఆర్డర్ చేశాడు. రెండు గంటలైనా బిర్యానీ రాకపోవడంతో గూగుల్ కస్టమర్ కేర్ నంబర్ వెతికాడు. గూగుల్ దొరికిన జొమాటో కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసి.. బిర్యానీ రాలేదని చెప్పాడు. అటు నుంచి ఫోన్ మాట్లాడిన వ్యక్తి క్షమాపణ అడుగుతూ.. ఆలస్యానికి పరిహారంగా ఉచితంగా బిర్యానీ ఇస్తామని, చెల్లించిన 500 రూపాయలు తిరిగి చెల్లిస్తామని చెప్పాడు. అందుకోసం వారు పంపిన లింక్ క్లిక్ చేయామని అన్నాడు.
Cyber Crime in Hyderabad: రూ.500 బిర్యానీ కోసం కాల్ చేస్తే.. రూ.50వేలు మాయం - జొమాటో బిర్యానీ చీటింగ్
Cyber Crime in Hyderabad : ఏదైనా సమాచారం కావాలంటే మనం గూగుల్‌లో వెతుకుతాం. కానీ కొన్నిసార్లు గూగుల్ కూడా మనల్ని మోసం చేస్తుంది. ముఖ్యంగా ఏదైనా కస్టమర్ కేర్ నంబర్‌ను గూగులో వెతికితే.. దాని ద్వారా సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకునే ప్రమాదముంది. అందుకే కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్‌లో వెతకొద్దని పోలీసులు పదే పదే చెబుతున్నారు. కానీ చాలా మంది దాన్ని పెడచెవిన పెట్టి సైబర్ వలకు చిక్కుకుంటున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. తాజాగా జొమాటోలో ఓ వ్యక్తి రూ.500 బిర్యానీ ఆర్డర్ చేసి.. ఆ బిర్యానీ రాలేదని గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్‌ను వెతికి సైబర్ నేరగాళ్లకు చిక్కాడు. రూ.50వేలు పోగొట్టుకున్నాడు.
Cyber Crime in Hyderabad
క్లిక్ చేశాడు.. బుక్ అయ్యాడు..
Customer Case Number Scam:వారు పంపిన లింక్ క్లిక్ చేసిన భాస్కర్‌కు.. రెండు నిమిషాల తర్వాత తన బ్యాంకు ఖాతా నుంచి 50 వేలు తీసినట్లుగా సందేశం వచ్చింది. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి 50 వేలు పొగొట్టుకున్నట్లు గుర్తించిన భాస్కర్... సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. కంపెనీల కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్ లో వెతకొద్దని.. వారి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడాలని పోలీసులు సూచిస్తున్నారు.
- ఇదీ చదవండి :ఫేస్బుక్ పరిచయం.. కోరిక తీర్చమంటూ బెదిరింపు!