క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించే సమయంలో లభ్యమైన నగదును.. 108 సిబ్బంది మృతుడి కుటుంబానికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని వైరా సమీపంలో జరిగింది. మధిరకు చెందిన వరుణ్ అనే యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయల పాలైన బాధితుడిని 108 సిబ్బంది జగదీశ్, వీరభద్రంలు ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది - రోడ్డు ప్రమాదాలు కారణాలు
ఖమ్మం జిల్లాలోని వైరా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడికి చెందిన నగదును అతడి కుటుంబానికి అందజేసి 108 సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు.
honesty of 108 staff
అప్పటికే పరిస్థితి విషమించిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి చెందిన రూ. 96వేల నగదు 108 సిబ్బందికి లభించగా.. వారు ఆ మొత్తాన్నిఅతడి కుటుంబ సభ్యులకు అందించారు.
ఇదీ చదవండి:Love cheating: ప్రేమన్నారు.. కోర్కెలు తీర్చుకున్నారు.. ఆపై