Man Killed His Wife : పుత్రుడి కోసం మరో పెళ్లి చేసుకున్న భర్త.. బాబు పుట్టాక మొదటి భార్యతో కలిసి రెండో భార్యను అంతం చేశాడు. ఆస్తిలో వాటా కావాలని అడిగినందుకే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం, మల్లాపూర్ తండా పంచాయతీ పరిధిలోని లోక్యాతండాలో బుధవారం చోటుచేసుకుంది. కొత్తూరు ఇన్‌స్పెక్టర్ బాలరాజు, ఎస్సై శంకర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లోక్యాతండాకు చెందిన కెతావత్ శ్రీనివాస్ (46), మంజుల (35) దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. పుత్ర సంతానం కోసం శ్రీనివాస్ ఇదే మండలంలోని చింతగట్టుతండాకు చెందిన సాలీ(21)ని మూడు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఎకరం పొలం రాసిస్తానని ముందే ఒప్పుకొన్నాడు. ప్రస్తుతం వీరికి రెండు సంవత్సరాల వయసున్న బాబు ఉన్నాడు. బుధవారం ఉదయం సాలీ తండ్రి ముడావత్ లక్యా కుమార్తెను చూసేందుకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో గూడూరు పంచాయతీ పరిధిలోని రామయ్య చెరువు వద్ద జనం గుమికూడి ఉండటం చూసి అక్కడికి వెళ్లాడు. చెరువులో తన కుమార్తె చనిపోయి కనిపించింది.
చంపి చెరువులో పడేసి..