Car accident in Gachibowli: రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనాన్ని కారుతో ఢీకొట్టి, మహిళ మృతికి కారణమైన నిందితుడు రాజసింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే కారుతో వారిని ఢీకొట్టినట్లు తెలిపారు. నిందితుడిపై 302, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేవలం క్షమాపణతో పోయేదానికి రాజసింహారెడ్డి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడని.. తన జీవితాన్నీ నాశనం చేసుకున్నాడని చెప్పారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించడంతో పాటు.. అతని తల్లిదండ్రులకు సైతం కౌన్సిలింగ్ ఇస్తామని స్పష్టం చేశారు.
అసలేెెం జరిగిదంటే:ఎర్రగడ్డకు చెందిన సయ్యద్ సైఫుద్దీన్ (27) వ్యాపారం చేస్తుంటారు.ఈ నెల 18న అర్ధరాత్రి 1.30 సమయంలో.. ఆయన తన భార్య మారియా మీర్(25), వరుసకు సోదరులయ్యే సయ్యద్ మిరాజుద్దీన్(24), రాషెద్ మాషా ఉద్దీన్(19)తో కలిసి రెండు ద్విచక్రవాహనాలపై ఎర్రగడ్డ నుంచి మాదాపూర్ తీగల వంతెన మీదుగా గచ్చిబౌలికి బయలుదేరారు. ఏఐజీ సమీపంలోకి రాగానే, బెంజ్ కారులో వెళ్తున్న జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి రాజసింహారెడ్డి(26) అక్కడి రోడ్డుపై ఉన్న నీటిలో నుంచి దూసుకెళ్లడంతో సైఫుద్దీన్ సోదరులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంపై ఆ నీరు పడింది. దీంతో వారు కారు డ్రైవర్‌ను వెంబడించి.. అలా ఎందుకు చేశావని, కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా వెళుతున్నావంటూ నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.