Man Kidnaps his Girlfriend's son : యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అల్లాపూర్‌లోని పిలీదర్గా సమీపంలో నివసించే మహిళ(24)కు రషీద్ అనే వ్యక్తితో 2017లో వివాహమైంది. ఆమెకు నాలుగేళ్లు, రెండేళ్లు ఉన్న ఇద్దరు పిల్లలున్నారు. ఏడాది క్రితం ఆమె భర్తకు విడాకులిచ్చింది. సమీపంలో నివసించే శంకర్(21)తో ఆమెకు పరిచయం ఏర్పడగా, మూడు నెలలుగా మోతీనగర్‌లోని బబ్బుగూడలో సహజీవనం చేస్తున్నారు.
పెళ్లొద్దు..సహజీవనం చేద్దామన్నందుకు మహిళ కుమారుడి కిడ్నాప్ - ప్రేయసి కుమారుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తి
Man Kidnaps his Girlfriend's son : ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు.. భర్తతో విడిపోయి మరో యువకుడితో సహజీవనం చేస్తోంది. ఆ యువకుడు పెళ్లి చేసుకుందామన్నాడు.. ఆమె నిరాకరించింది.. కలిసి జీవిద్దామని చెప్పింది.. జీర్ణించుకోలేని యువకుడు.. ఆమె రెండేళ్ల కుమారుడ్ని కిడ్నాప్ చేశాడు. జూబ్లీహిల్స్ ఠాణాలో ఆమె ఫిర్యాదు చేసింది.

Man Kidnaps his Girlfriend's son
ఈనెల 14న పెళ్లి చేసుకుందామని శంకర్.. ఆమెతో గొడవకు దిగాడు. వద్దని ఆమె సహజీవనం చేద్దామని తేల్చిచెప్పింది. ఇందుకు నిరాకరించిన శంకర్.. తనతో ఉండాలంటే పిల్లల్ని తీసుకురావాలని తేల్చిచెప్పాడు. నిరాకరించడంతో అదేరోజు సాయంత్రం ఆమె స్నేహితురాలి ఇంట్లో ఉన్న మహిళ చిన్న కుమారుణ్ని తీసుకొని పరారయ్యాడు. పోలీసులు గాలిస్తున్నారు.