తెలంగాణ

telangana

ETV Bharat / crime

Man Injured in Marriage : పెళ్లిలో పేకాడాడు.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు..! - man died in wedding

Man Injured in Marriage : పెళ్లింట ఉండే ఆ సందడే వేరు. భాజాభజంత్రీలతో పరిసరాలు మారుమోగిపోతుంటే.. ఆటలు, పాటలకైతే చెప్పే పనే లేదు. అయితే.. సందట్లో సడేమియా అంటూ పేకాటరాయుళ్లు సైతం ముక్క తిప్పేస్తుంటారు. ఇలాగే.. ఓ వ్యక్తి పేకాట ఆడాడు. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు..!

Man Injured in Marriage : పెళ్లిలో పేకాడాడు.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు..!
Man Injured in Marriage : పెళ్లిలో పేకాడాడు.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు..!

By

Published : Dec 19, 2021, 5:27 PM IST

Man Injured in Marriage : పెళ్లంటేనే హడావుడి.. పందిళ్లు, సందళ్లు. భాజాభజంత్రీలతో మారుమోగిపోతాయి ఆ పరిసరాల్లో ఆటలు, పాటలకైతే చెప్పే పనే లేదు. ఇవన్నీ ఒక పక్కైతే సందట్లో పేకాటరాయుళ్ల సడేమియా తెలియంది కాదు. కానీ ఆ వివాహ వేడుకలో సరదాగా ఆడిన మూడు ముక్కలాట అతని ప్రాణాలపైకే తెచ్చింది.

పెళ్లిలో పేకాడాడు.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు..!

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాల్​లో ఓ వివాహ వేడుక అట్టహాసంగా జరుగుతోంది. ఓ వైపు అంతా నవ్వుతూ తుళ్లుతూ పెళ్లి తంతు చూస్తున్నారు. మరో వైపు సరదా సరదా ఆటలతో ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఆటల్లో భాగంగా కొందరు పేకాట ఆడుతూ ఆనందిస్తున్నారు. అయితే.. అంతలోనే ఫంక్షన్ హాల్లో పేకాట ఆడుతున్నారంటూ సమాచారం అందుకున్నారు పోలీసులు.

వెంటనే.. ఫంక్షన్ హాల్లో తనిఖీలు చేసేందుకు వచ్చారు. సరదాగా పేకాట ఆడుతున్న వారు పోలీసులను చూసి ఖంగుతున్నారు. వారి నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి పరుగు లంకించుకున్నారు. ఈ క్రమంలో పేకాట ఆడుతున్న ఆది శేఖర్ రెడ్డి అనే వ్యక్తి పరిగెడుతూ.. పరిగెడుతూ.. అడ్డుగా వున్న గోడను దాటేందుకు ప్రయత్నించాడు. గోడపై నుంచి దిగే సమయంలో జారిపడ్డాడు. దీంతో.. ఆదిశేఖర్ రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివాహ వేడుకలో సరదాగా ఆడిన పేకాట చివరికి ప్రాణాల మీదకే తెచ్చిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి :

Father Suicide After Son's Death : కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details