తెలంగాణ

telangana

ETV Bharat / crime

యువతికి అసభ్యకర​ సందేశాలు.. నిందితుని అరెస్ట్​ - హైదరాబాద్ తాజా​ వార్తలు

స్నాప్ చాట్​లో పరిచయమైన యువతికి వాట్సాప్​లో అసభ్యకర సందేశాలు పంపిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడిని రిమాండ్​కు తరలించారు.

పెళ్లయ్యే యువతికి వాట్సప్​ సందేశాలు
పెళ్లయ్యే యువతికి వాట్సప్​ సందేశాలు

By

Published : May 26, 2021, 8:42 PM IST

ప్రేమ పేరుతో వాట్సాప్ సందేశాల ద్వారా వేధిస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూరుకి చెందిన శివ కుమార్​కు స్నాప్ చాట్​లో నగరానికి చెందిన యువతి పరిచయం అయింది. అది కాస్తా స్నేహంగా మారింది. యువతిని కలిసేందుకు హైదరాబాద్ వచ్చిన శివకుమార్ తన ప్రేమ విషయం ఆమెకు చెప్పాడు. వ్యతిరేకించిన యువతి తనకు పెళ్లి కుదిరిందని.. త్వరలో తన పెళ్లి జరగనుందని చెప్పింది.

యువతిపై కోపం పెంచుకున్న శివ ఆమెకు వాట్సాప్​లో అసభ్యకర సందేశాలుపంపించడం ప్రారంభించాడు. అంతే కాకుండా పెళ్లి చేసుకునే వ్యక్తికి కూడా అసభ్యకర సందేశాలు పంపించాడు. దీంతో బాధితురాలు పోలీసులనుఆశ్రయించింది. దర్యాప్తు చేసిన రాచకొండ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:'మానుకోట తిరుగుబాటు.. సమైక్యాంధ్రుల మీద సాధించిన గొప్ప విజయం'

ABOUT THE AUTHOR

...view details