హైదరాబాద్ కూకట్పల్లిలో రహమాన్ అనే వ్యక్తి.. శనివారం సాయంత్రం కృష్ణతుంగా రెస్టారెంట్ నుంచి పాయ ఆర్డర్ పెట్టుకున్నాడు. డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకురాగానే తన కుమార్తె పాయను రెండు స్పూన్లు తిన్నది. రహమాన్ కూడా తిందామని చూసేలోగా అందులో బల్లి అవశేషాలు కనిపించాయి. వెంటనే తన కుమార్తెను ఆస్పత్రికి తరలించిన అతను.. హోటల్ యజమాని వద్ద వెళ్లి నిలదీయగా అతను నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.
Online Food : పాయలో బల్లి అవశేషాలు.. పోలీసులకు బాధితుడు ఫిర్యాదు - lizard in paya of kritunga restaurant
సాయంత్రం పూట భోజనం చేద్దామని ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఓ వ్యక్తికి అందులో బల్లి అవశేషాలు కన్పించాయి. అప్పటికే అతని కుమార్తె రెండు స్పూన్లు తినడంతో ఆందోళన చెందిన అతను.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు.
పాయలో బల్లి, కూకట్పల్లిలో పాయలో బల్లి
అనంతరం రహమాన్ కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించాడు. హోటల్ వద్దకు చేరుకున్న పోలీసులు పాయాను పరీక్ష నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. కలుషిత ఆహారం సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యజమానిని హెచ్చరించారు.
Last Updated : Jun 6, 2021, 5:47 PM IST