GOLD THEFT: నమ్మకంగా ఉన్నాడు.. చివరికి నిండా ముంచేశాడు - 10 కేజీల బంగారంతో పారిపోయిన నగల తయారీ దారు
16:03 August 23
GOLD THEFT: నమ్మకంగా ఉన్నాడు.. చివరికి నిండా ముంచేశాడు
బంగారు నగల తయారీలో నలుగురి దగ్గర నమ్మకం సంపాదించాడు. దీంతో పెద్ద ఎత్తున బంగారం వ్యాపారుల వద్ద నుంచి ఆర్డర్లు వచ్చాయి. ఇదే అదనుగా భావించి భారీ ఎత్తున బంగారంతో పరారయ్యాడు ఓ ఆభరణాల తయారీదారు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల 9 మంది వ్యాపారులు ఆభరణాలు తయారుచేసేందుకు 10 కేజీల బంగారాన్ని దిలీప్ కుమార్ అనే నగల తయారీదారుకు ఇచ్చారు. వాటిని కాజేయాలని చూసిన దిలీప్.. ఆ బంగారాన్ని తీసుకొని ఇంట్లో లేఖ పెట్టి పారిపోయారు.
విజయవాడ బస్టాండులో బంగారం ఉన్న బ్యాగు పోయిందని దిలీప్ లేఖలో పేర్కొన్నాడు. విజయవాడ నుంచి బందరు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని లేఖలో వివరించాడు. దీంతో బంగారం ఇచ్చిన 9 మంది వ్యాపారులు.. దిలీప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరారు. నిందితుడు మంగళగిరి వాసిగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి:Etela rajender: ఫోటోలు తీశాడని ఏఎస్ఐతో భాజపా కార్యకర్తల డిష్యుం..డిష్యుం..