హైదరాబాద్ సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఎలమంచిలి నరసింహ (44) అనే వ్యక్తి... కబీర్ నగర్లోని ఓ భవనంలో పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. ఆయన మూడో అంతస్తులో పనిచేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి మరణించినట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో పెయింటర్ మృతి - Hyderabad latest news
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన... హైదరాబాద్ సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పెయింటింగ్ వేస్తుండగా విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి, హైదరాబాద్ తాజా వార్తలు
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొన్నేళ్లుగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడని... అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నేతల పరస్పర విమర్శలు... బయటపడుతున్న తెరాస రహస్యాలు..!