తెలంగాణ

telangana

ETV Bharat / crime

మద్యం మత్తు.. మంచినీళ్లు అనుకొని యాసిడ్‌ కలుపుకొని తాగి వ్యక్తి మృతి - మద్యం మత్తు.. మంచినీళ్లు అనుకొని యాసిడ్‌ కలుపుకొని తాగి వ్యక్తి మృతి

మద్యం మత్తు.. మంచినీళ్లు అనుకొని యాసిడ్‌ కలుపుకొని తాగి వ్యక్తి మృతి
మద్యం మత్తు.. మంచినీళ్లు అనుకొని యాసిడ్‌ కలుపుకొని తాగి వ్యక్తి మృతి

By

Published : May 9, 2022, 12:38 PM IST

12:18 May 09

మద్యం మత్తు.. మంచినీళ్లు అనుకొని యాసిడ్‌ కలుపుకొని తాగి వ్యక్తి మృతి

మద్యం మత్తులో నీళ్లు అనుకొని యాసిడ్‌ను కలుపుకొని తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం ముల్కల్లలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రవేని మహేష్‌(29) సింగరేణిలో ఉద్యోగం చేస్తాడు. గత నెల 18న మద్యం మత్తులో మంచినీరు అనుకొని యాసిడ్‌ బాటిల్‌లోని యాసిడ్‌ను మద్యంలో కలుపుకుని తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి చేరాడు. ఇది గుర్తించిన అతడి కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అప్పటి నుంచి చికిత్స పొందుతున్న అతను ఈరోజు మృతి చెందినట్లు హాజీపూర్‌ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ తెలిపారు. మహేశ్‌కు తండ్రి శంకరయ్య, తల్లి లక్ష్మి, భార్య స్వర్ణలత, కుమారుడు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి..

విద్యార్థులు, యువతే టార్గెట్.. జోరుగా మత్తు ఇంజెక్షన్ల అమ్మకం

B.pharm Student Death Case : బీఫార్మసీ విద్యార్థిని కేసులో నిందితుడు అరెస్ట్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details