ఎవరి ఇంట్లో పాము కనిపించినా ఆ వ్యక్తినే పిలిచి పట్టిస్తారు. మరి అలాంటి వ్యక్తినే పాము కాటేసింది. చనిపోయిందనుకుని భావించి పామును చేతితో పట్టుకుని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా కాటేసింది. ఫలితంగా అతని ప్రాణాలు గాలిలో కలిశాయి. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లిలో శుక్రవారం జరిగింది.
ప్రాణం పోయిందని పట్టుకుంటే.. అతని ఆయువే తీసింది - snake bite deaths at manthralayam
ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లిలో ఓ వ్యక్తి పాము కాటుతో మృతి చెందాడు. పాము చనిపోయిందని దాని ముట్టుకోగా.. కాటు వేసింది.
![ప్రాణం పోయిందని పట్టుకుంటే.. అతని ఆయువే తీసింది man-died-with-snake-bite-at-manthralayam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12340404-1089-12340404-1625284361443.jpg)
ప్రాణం పోయిందని పట్టుకుంటే.. అతని ఆయువే తీసింది
మాలపల్లి గ్రామంలోని పాఠశాల వద్ద పాము కనిపించడంతో జనం వెంటనే రంగస్వామిని పిలిచించారు. అతను అక్కడికి చేరుకుని దానిని కర్రతో కొట్టాడు. చనిపోయిందనుకుని చేతితో పట్టుకుని చూస్తుండగా ఇంతలో కాటు వేసింది. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఇదీ చదవండి:న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించడం తగదు: హైకోర్టు