Brothers died due to Heart Attack: దాదాపు 50 ఏళ్లపాటు తనతో కలిసి పెరిగిన తమ్ముడు ఇక లేడు అని తెలిసేసరికి ఆ అన్న తట్టుకోలేకపోయారు. కాసేపట్లో తన రక్త సంబంధం మట్టిలో కలిసిపోతుందనే బరువైన నిజాన్ని ఆ అన్న గుండె మోయలేకపోయింది. అందుకే తమ్ముడి మరణవార్తను తట్టుకోలేని ఆ అన్న హృదయం.. ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక్కరోజులేనే గుండెపోటుతో అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో.. వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. 24 గంటల వ్యవధిలో అన్నదమ్ములిద్దరూ గుండెపోటుతో మృతి చెందారు. లక్షెట్టిపేట పట్టణానికి చెందిన గాజుల భాస్కర్ గౌడ్ (47).. ఆదివారం గుండె పోటుతో మృతి చెందారు. తమ్ముడు మృతదేహాన్ని చూసిన అన్న శ్రీనివాస్ గౌడ్ సైతం గుండెపోటుతోనే తుదిశ్వాస విడిచారు.