తెలంగాణ

telangana

ETV Bharat / crime

Balanagar Flyover: 'వేగంగా వెళ్తూ... సేఫ్టీ డివైడర్​ను ఢీకొట్టి' - బాలానగర్ యాక్సిడెంట్ న్యూస్

ఫ్లై ఓవర్ డివైడర్​ను ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ ఫ్లైఓవర్​పై చోటుచేసుకుంది. మృతుడు ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

man
మేడ్చల్ మల్కాజిగిరి

By

Published : Jul 20, 2021, 10:12 PM IST

Updated : Jul 20, 2021, 10:52 PM IST

ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తూ... ఫ్లై ఓవర్ డివైడర్​ను ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన బాలానగర్ పైవంతనపై (Balanagar Flyover) చోటుచేసుకుంది. ఏపీ ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్... లారీ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ కేపీహెచ్​బీలో ఉండే తన సోదరుడు ఇంటికి వచ్చిన అశోక్... లైసెన్స్ తీసుకునేందుకు తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు.

బాలానగర్​పై వంతెనపై వేగంగా వెళ్తు ఎడమవైపు ఉన్న సేఫ్టీ డివైడర్​ను ఢీకొట్టాడు. తీవ్రగాయాలపాలైన అశోక్​ను... స్థానికుల సాయంతో 108లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం తాలుకు దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఇటీవలే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభమైంది. పైవంతెన ప్రారంభమయ్యాక జరిగిన మొదటి ప్రమాదం ఇదే.

Balanagar Flyover: 'వేగంగా వెళ్తూ... సేఫ్టీ డివైడర్​ను ఢీకొట్టి'

ఇదీ చూడండి: యోగా చేస్తుండగా ప్రమాదం- ఆసుపత్రిలో మాజీ మంత్రి

Last Updated : Jul 20, 2021, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details