సికింద్రాబాద్ రైలు పట్టాల మధ్య నడుచుకుంటూ.. వెళ్తోన్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన వ్యక్తి అక్కడిక్కడే మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మేడ్చల్ డబిర్పూర రైల్వేస్టేషన్ల నడుమ రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తన్న వ్యక్తిపై రైలు… ఢీకొట్టడంతో అతను మృతి చెందాడు.
రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి - Man died in train accident
సికింద్రాబాద్ రైలు పట్టాల మధ్య నడుచుకుంటూ.. వెళ్తోన్న ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Man died in train accident
చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడం వల్ల పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులకు సంబంధించిన ఆ కుటుంబీకులు ఎవరైనా ఉంటే.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
ఇదీ చదవండి:ఆపదలో నిట్టూర్పు.. అది చాల్లే వీరికి పిలుపు