తెలంగాణ

telangana

ETV Bharat / crime

స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి - గుంటూరు క్రైం న్యూస్

ఏపీలోని గుంటూరులో దారుణం జరిగింది. ఓ బార్​లో యువకుడిని తోటి స్నేహితులు కొట్టి హతమార్చారు. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

man-dead-on-a-attack-in-guntur
స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

By

Published : Mar 23, 2021, 7:06 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు కేవీపీ కాలనీలోని గెలాక్సీ బార్​లో గోపీనాథ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. స్నేహితులతో కలసి బార్​కు వెళ్లిన గోపీనాథ్​కు, అతని స్నేహితుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో గోపీనాథ్​పై కర్రలతో దాడి చేయడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న నగరపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు నగరంపాలెం సీఐ మల్లికార్జున రావు తెలిపారు.

ఇదీ చదవండి:జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో అపశ్రుతి

ABOUT THE AUTHOR

...view details